Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

13-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో స్థానిక యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు కేవలం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఉన్నత హోదాల్లోనూ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన MRO, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఈ చర్య కీలకంగా మారవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

Article Image

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో స్థానిక యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు కేవలం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఉన్నత హోదాల్లోనూ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన MRO, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఈ చర్య కీలకంగా మారవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News