Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు

03-06-2026 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మినీ ట్రావెల్స్ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Sthanikam

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, 13 మందికి గాయాలు

Article Image

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన మినీ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అరుణాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరిన మినీ ట్రావెల్స్ బస్సు నార్కెట్‌పల్లి శివారుకు చేరుకునే సరికి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News