Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టైర్ పేలడంతో అదుపుతప్పిన బస్సు... డివైడర్ దాటి లారీని ఢీకొట్టిన ఘోర ప్రమాదం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 10:13 AM

నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి..

నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి..

నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందండి..
April 05, 2026 06:43 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశం..

నల్గొండ : రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లభించాలంటే రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. ఆదివారం నల్గొండ సమీపంలోని ఆర్జల బావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటను బాగా తూర్పారబట్టి తాలు, తరుగు, చెత్త వంటివి లేకుండా నాణ్యంగా తీసుకువస్తేనే గ్రేడ్ 'ఏ' రకానికి రూ. 2389, కామన్ వెరైటీకి రూ. 2369 మద్దతు ధర పొందవచ్చని స్పష్టం చేశారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల వద్దే తూర్పారబట్టే యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, టార్పాలిన్లు మరియు గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ రబీలో మొత్తం 401 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపేందుకు ఇప్పటికే 124 రైస్ మిల్లులను అనుసంధానం చేశామని తెలిపారు. కేంద్రాల ఇన్చార్జిలకు ఇదివరకే తగిన శిక్షణ ఇచ్చామని, ధాన్యాన్ని సీనియార్టీ ప్రకారం సీరియల్ నంబర్ అనుసరించి కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ నెల 2న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్లలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం సేకరణలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఈ విషయంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. అనవసరంగా తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, తహసిల్దార్ పరుశురాం తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News