Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం

14-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూసి ప్రక్షాళన అంశంపై బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మండిపడ్డారు. గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను “బ్రోకర్ల రాష్ట్ర సమితి”గా అభివర్ణించారు. నల్లగొండ ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

నల్లగొండ జిల్లాలో సుమారు 45 లక్షల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే, బీఆర్‌ఎస్ నేతలు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను అనుసరిస్తూ హరీష్ రావు కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న నాయకులు నల్లగొండ జిల్లాను అభివృద్ధి నుంచి దూరం చేయాలని చూస్తున్నారని కైలాష్ నేత అన్నారు. మూసి నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కైలాష్ నేత స్పష్టం చేశారు.

Sthanikam

నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News