Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

07-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభివృద్ధి అంశాలపై సమావేశం

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు విడుదల చేయాలని కోరారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మూడు ప్రాంతాల్లో ఎదురవుతున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే లో వోల్టేజ్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని అధికారులను కోరారు.

సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News