Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

నల్లగొండ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల దృష్టి – డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు

15-04-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, పిట్టంపల్లి క్రాస్ వద్ద సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా జాతీయ రహదారిపై ప్రయాణించే గూడ్స్ వాహనాల భద్రతపై కూడా డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గూడ్స్ క్యారియర్ వాహనాలకు తప్పనిసరిగా కస్సాన్ రేడియం స్టిక్కర్లు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

Sthanikam

నల్లగొండ జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీసుల దృష్టి – డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా స్థానిక సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వెలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, పిట్టంపల్లి క్రాస్ వద్ద సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

అదే విధంగా జాతీయ రహదారిపై ప్రయాణించే గూడ్స్ వాహనాల భద్రతపై కూడా డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గూడ్స్ క్యారియర్ వాహనాలకు తప్పనిసరిగా కస్సాన్ రేడియం స్టిక్కర్లు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News