Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డేగుల్‌వాడిలో రైతుల పంటల నమోదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 04:23 PM

నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం

02-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ముఖ్య అతిథులుగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా..

నగర అభివృద్ధికి కొత్త శోభ.. మేనేజ్‌మెంట్‌కు అభినందనల జల్లు

నల్లగొండ : వేగంగా విస్తరిస్తున్న నల్లగొండ నగర మకుటంలో మరో మణిహారం చేరింది. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో నూతనంగా నిర్మించిన ‘శ్రీ వెంకట రమణ గ్రాండ్’ హోటల్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గౌరవ సమక్షంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హోటల్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అంతకుముందు నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అతిథులకు సాదరంగా స్వాగతం పలికారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ నగరం రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, పెరుగుతున్న పారిశ్రామిక, వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ప్రీమియం హోటళ్లు రావడం శుభపరిణామమని కొనియాడారు. అత్యాధునిక సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించే విధంగా హోటల్‌ను తీర్చిదిద్దిన మేనేజ్‌మెంట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, నగరానికి వచ్చే సందర్శకులకు ఉత్తమ సేవలు అందిస్తూ నల్లగొండ ప్రతిష్టను పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

​త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధిలో ఆతిథ్య రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పర్యాటకులకు మరియు వ్యాపారవేత్తలకు కావాల్సిన అన్ని వసతులు ఒకే చోట లభించడం అభినందనీయమన్నారు. ఈ హోటల్ నగర వాసులకు ఒక కొత్త అనుభూతిని అందించడమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండలో 'శ్రీ వెంకట రమణ గ్రాండ్' రెస్టారెంట్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News