Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా
17-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పిఆర్సి, పెన్షన్ బకాయిల తక్షణ చెల్లింపుకు డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 నుంచి రావలసిన రెండో పిఆర్సిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాలని కోరారు. పెన్షన్ బకాయిలు అందక ఇప్పటికే 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వీసులో ఉన్న ఉద్యోగుల ₹13 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, అలాగే నిల్వలో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

జేఏసీ సెక్రటరీ జనరల్ భగత్ మాట్లాడుతూ, ఉద్యోగులకు హామీ ఇచ్చిన హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అమరేందర్ రెడ్డి, యాదయ్య, జగన్మోహన్ ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణ, లక్ష్మీనర్సింహారెడ్డి, శైలజ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News