Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:23 PM

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

25-04-2026 301 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ATMలను లక్ష్యంగా చేసుకుని లూటీకి పాల్పడిన దొంగల ముఠా హైదరాబాద్ వైపు వస్తోందన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్యాల వద్ద జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీలను గమనించిన దొంగలు తెలివిగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని AP 40 FL 0512 నంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న దొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Sthanikam

నల్గొండలో కలకలం: ఏపీ ATM దొంగల ముఠా పరార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News