Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

నల్గొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

22-04-2026 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ: జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ సేవల పేరుతో సిబ్బంది ప్రజల నుండి అదనపు నగదు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

దాడుల సందర్భంగా కార్యాలయంలో ఉన్న పలు ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు, చెల్లింపుల విధానం, అధికారిక రికార్డులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.

అలాగే, అధికారిక సిబ్బంది కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఏసీబీ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టింది. ఆన్‌లైన్ చెల్లింపుల పేరిట ప్రైవేట్ ఖాతాలకు డబ్బులు వెళ్లాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.ఈ దాడులతో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పూర్తి స్థాయి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి.

Sthanikam

నల్గొండ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News