Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

31-01-2026 232 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి నిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 48 వార్డులకు గాను 581 నామినేషన్లు దాఖలవగా, స్క్రూటినీ అనంతరం 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

మిగిలిన 576 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగానే చెల్లుబాటు నామినేషన్లు ఉన్నట్లు వెల్లడించారు.

పార్టీల వారీగా పరిశీలిస్తే

కాంగ్రెస్ పార్టీ నుంచి 143,

బీఆర్ఎస్ నుంచి 134,

బీజేపీ నుంచి 122,

ఎంఐఎం నుంచి 17 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి.

అదేవిధంగా బీఎస్పీ, సీపీఐ(ఎం) పార్టీల నుంచి చెరో 4 నామినేషన్లు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల గుర్తింపు పొందిన/రిజిస్టర్డ్ పార్టీల నుంచి 55 నామినేషన్లు, స్వతంత్ర అభ్యర్థులుగా 97 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో నగరంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వార్డు స్థాయిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Sthanikam

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News