Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి

15-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగిన “ARRIVE-ALIVE” కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణనష్టం తగ్గుతుందని తెలిపారు.డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ పాత్ర ఉండటంతో హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. కార్లలో సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ARRIVE-ALIVE కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో హైవేపై అవసరమైన వంతెనల నిర్మాణం చేపడతామని తెలిపారు.

Sthanikam

నకిరేకల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – ARRIVE-ALIVEపై దృష్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News