Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

నాగార్జున పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం “ఆరోహణ”

19-04-2026 223 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని నాగార్జున పాఠశాలలో వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది “ఆరోహణ” అనే థీమ్‌ను ఎంపిక చేసి విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాల సాధనపై చైతన్యం కల్పించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ సీఐ దుబ్బ కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. జబర్దస్త్ ఫేమ్ రాజమౌళి విద్యార్థులు కృషితో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ కట్ట శేఖర్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించగా, డాక్టర్ నాగేశ్వరరావు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. పీహెచ్‌డీ స్కాలర్ పి.శ్రీనివాస్ ప్లే వే మెథడ్ ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారని తెలిపారు.

పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు వార్షికోత్సవ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు సమగ్ర అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్రీమతి రేఖ వార్షిక నివేదికను సమర్పించి పాఠశాల విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు.

కార్యక్రమంలో తల్లిదండ్రులు జిక్ర తబస్సుం, వసుంధర తమ అనుభవాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు అక్రమ్, సంతోష్, నరసింహ, సంధ్య, విజయ్ శ్రీ, వినిషలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం “ఆరోహణ”

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News