Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:26 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్

11-03-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్ నిర్వహించారు. జాతీయ గ్రీన్ కార్ప్స్ సూచనల మేరకు ఎన్‌జి కాలేజ్‌లోని ఈకో క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణంపై బాధ్యతాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రకృతి సంపదలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వ్యర్థ పదార్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష పేపర్ క్రాఫ్ట్ ప్రాముఖ్యతను వివరించారు. పాత వార్తాపత్రికలు, మ్యాగజీన్లు, ఉపయోగించని కాగితాలను వినియోగించి అలంకరణ వస్తువులు, పూలు, గోడ అలంకరణలు తయారు చేయవచ్చని చెప్పారు. ఈ విధంగా “తగ్గింపు–మళ్లీ వినియోగం–పునర్వినియోగం” భావనను విద్యార్థులు ఆచరణలో పెట్టవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్‌జీసీ ప్రాజెక్ట్ లీడర్ రాజశేఖర్, జిల్లా ఎన్‌జీసీ కోఆర్డినేటర్ లక్ష్మీకాంత్ ప్రత్యేక అతిథులుగా హాజరై విద్యార్థులను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పరంగి రవి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ మునుస్వామి, డాక్టర్ బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేశ్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News