Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:39 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
29-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నా పేట మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన గుండాల దాసుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.31 వేల చెక్కు ఆదివారం అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దాసు, కోలుకుంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన చెక్కును గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల కృష్ణ గౌడ్, నవీన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి అందించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ, నీల నరసింహం, బత్తిని వెంకటేశం, పెద్దోళ్ల మల్లేశం, యాదయ్య, లచ్చయ్య, బత్తుల మల్లేష్, దాసరి మల్లేష్, నిరంజన్, అలాగే గ్రామ పెద్దలు రామకృష్ణ, నరేష్ పాల్గొన్నారు.

ఈ సహాయం అందడంతో గుండాల దాసు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు మరియు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News