Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో–2026.. రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:34 PM

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ
01-04-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చైర్మన్ ఛాంబర్‌లోనే మందు పార్టీ.. విలేకరులపై బెదిరింపులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ప్రభుత్వ కార్యాలయ పరువు బజారున పడే ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుల సేవ కోసం ఏర్పాటు చేసిన సింగిల్‌విండో కార్యాలయం, ఉద్యోగుల మందు పార్టీలకు వేదికగా మారింది. విధులు ముగిసిన తర్వాత కార్యాలయాన్ని మూసివేయాల్సిన ఉద్యోగులు, అర్థరాత్రి వరకు అదే కార్యాలయంలో మద్యం సేవిస్తూ హంగామా సృష్టించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

సమాచారం ప్రకారం, మోత్కూరు రైతుసేవా సహకార సంఘం (సింగిల్‌విండో) కార్యాలయంలో నలుగురు ఉద్యోగులు చైర్మన్ ఛాంబర్‌ను సిట్టింగ్ రూంగా మార్చుకుని మద్యం పార్టీ నిర్వహించారు. చైర్మన్ టేబుల్‌పైనే మందుబాటిళ్లు, తినుబండారాలు పెట్టుకుని తాగుతూ హద్దులు దాటారు. ఈ పార్టీలో నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి పృధ్వి, అడ్డగూడూరు సింగిల్‌విండో కంప్యూటర్ ఆపరేటర్ శివ కూడా పాల్గొన్నట్లు సమాచారం.ఈ వ్యవహారం తెలిసి అక్కడికి చేరుకున్న విలేకరులు ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించగా, అక్కడున్న ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. “ఫొటోలు తీసి ఏం చేస్తారు… ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలాంటి వ్యవహారం జరగడం పట్ల స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పాలకవర్గాల లేమి, పర్యవేక్షణ లోపం కారణంగానే ఉద్యోగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజా నమ్మకాన్ని దెబ్బతీసే ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

మోత్కూరు సింగిల్‌విండోలో రాత్రి రచ్చ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News