Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 06:28 PM

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. రాహుల్ గాంధీపై దాడిని ఖండించిన కాంగ్రెస్ నేతలు..

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. రాహుల్ గాంధీపై దాడిని ఖండించిన కాంగ్రెస్ నేతలు..

మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.  రాహుల్ గాంధీపై దాడిని ఖండించిన కాంగ్రెస్ నేతలు..
July 22, 2026 03:53 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు దాడిని నిరసిస్తూ రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పున్న జగన్మోహన్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన చర్య అని విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను అడ్డుకోవడంతో పాటు ఆయనపై దాడి చేయడం కేంద్ర ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు.

దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్న ఆయన.. విద్యార్థులపై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జమీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, ఉప సర్పంచ్ మోటే రమేష్, జింకల ప్రభాకర్ రెడ్డి, బొడ్డు సాలయ్య, సాల్వేర్ అశోక్, వనం చంద్రశేఖర్, మొహమ్మద్ నాసర్, మొహమ్మద్ అక్రమ్, కోట సుధాకర్, మోటే మహేష్, మొహమ్మద్ అంజాత్, కేశవదాసు వెంకటేష్, మీర్జా అస్లం బేగ్, నోముల ప్రవీణ్ కుమార్, మొహమ్మద్ రిజ్వాన్, లెక్కల ప్రవీణ్, మొహమ్మద్ అజార్, బండ అంజిరెడ్డి, కొండ శేఖర్ గౌడ్, గడ్డం యాదగిరి, మీర్జా ఇనాయతుల్లా బేగ్, చింతల కృష్ణ, స్వామి, దామోదర్ రెడ్డి, లవణం సాయి, ఎండీ సమీర్, సైదాచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News