Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి.. ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:43 PM

మంత్రి హోదా పొందిన వేముల వీరేశంకు ఘనాభినందనలు

22-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నోట్‌బుక్‌లు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్‌గా నియమితులై మంత్రి హోదా పొందిన వేముల వీరేశంను నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంకు నోట్‌బుక్‌లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారంలో తీసుకుంటున్న చొరవకు గుర్తింపుగానే ప్రభుత్వం విప్ పదవితో పాటు మంత్రి హోదా కల్పించిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అంతటి రాజు, గోలి ఆంజనేయులు, బద్దం మల్లేష్, గోలి నరేష్ తదితరులు పాల్గొని వేముల వీరేశంకు అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో మరింత కృషి చేస్తామని వారు తెలిపారు.

Sthanikam

మంత్రి హోదా పొందిన వేముల వీరేశంకు ఘనాభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News