Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 05:41 AM

మిషన్ భగీరథ కార్మికులకు న్యాయం ఎప్పుడు? – పెండింగ్ వేతనాల చెల్లింపుపై సిఐటియు డిమాండ్

మిషన్ భగీరథ కార్మికులకు న్యాయం ఎప్పుడు? – పెండింగ్ వేతనాల చెల్లింపుపై సిఐటియు డిమాండ్

మిషన్ భగీరథ కార్మికులకు న్యాయం ఎప్పుడు? – పెండింగ్ వేతనాల చెల్లింపుపై సిఐటియు డిమాండ్
April 21, 2026 08:34 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ జిల్లా: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన పెంచిన వేతనాలను జనవరి నెల నుంచే అమలు చేయాలని సిఐటియు (CITU) జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దొడ్డి కొమరయ్య భవన్‌లో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ, మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో సుమారు 690 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు నెలకు కేవలం రూ.10,000 నుండి రూ.12,000 వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, అవి కూడా ప్రతి నెల చెల్లించకుండా ఆరు నెలలకు ఒకసారి చెల్లించడం అన్యాయమని అన్నారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వకుండా వేతనాల చెల్లింపులో ఆలస్యం చేయడం వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.

ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారుల సమక్షంలో కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ కార్పొరేషన్‌లో మిషన్ భగీరథ కార్మికులను కూడా చేర్చాలని కోరారు. దీంతో వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా, రానున్న మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ల వద్ద సిఐటియు జెండాలు ఎగురవేసి కార్మిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు జంజరాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుడ్తల సైదులు, ఉపాధ్యక్షులు నేలపట్ల అశోక్, కోశాధికారి ఉయ్యాల మురళి, నాయకులు శంకర్, ఆంజనేయులు, పరమేష్, కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News