Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:24 AM

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

19-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మేడే వారోత్సవాలను అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా నిర్వహించి విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్, భవన నిర్మాణ, ఆటో, గ్యాస్ తదితర రంగాల కార్మికులు తమ తమ కూడళ్లలో జెండాలు ఎగర వేసి, రైల్వే స్టేషన్‌ నుంచి పట్టణంలో ర్యాలీగా వచ్చి రైతు బజార్ వద్ద జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు నష్టదాయకమని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రతి కార్మికునికి రూ.25 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మేడే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఊదరి రామచందర్, ఆడెపు వెంకటేష్, సిరిపంగి రవి, బొట్టు బాలనరసింహ, పడిగెల కుమార్, విజయ్, మాచర్ల సత్యమ్మ, కొమ్ము వరమ్మ, దేవరకొండ మంజుల, భాగ్యమ్మ, సునీత, శ్యామల, ఉడుత సోములు, కత్తెరపోయిన శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలి: సిఐటియు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News