Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

04-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజిగిరిలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు తరచూ అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నేడు “రసాయన బంధం” అనే అంశంపై విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. లావణ్య హాజరై ఉపన్యసించారు.

డాక్టర్ ఆర్. లావణ్య రసాయన బంధాల స్వభావం, అయానిక్ మరియు కోవేలెంట్ బంధాల మధ్య తేడాలు, వాటి లక్షణాలు, అణువుల నిర్మాణంలో బంధాల ప్రాధాన్యత వంటి అంశాలను సులభంగా వివరించారు. రసాయన బంధాల అవగాహన ద్వారా ఔషధ తయారీ, పదార్థ శాస్త్రం, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులకు తెలియజేశారు. శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.అనంతరం ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అడవి రాజు ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల రసాయన శాస్త్ర అధ్యాపకులు జి. స్వాతి, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మల్కాజిగిరి డిగ్రీ కళాశాలలో డాక్టర్ లావణ్య చే రాసాయన శాస్త్రంలో విస్తృతోపన్యాసం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News