Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:28 PM

మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి: నీలం మధు ముదిరాజ్

14-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలుగు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి సందర్భంగా బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో యువకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడితో సంక్రాంతి పండుగ కనువిందు చేస్తుందని అన్నారు.

ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి: నీలం మధు ముదిరాజ్

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలుగు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.భోగి సందర్భంగా బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్‌లో యువకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడితో సంక్రాంతి పండుగ కనువిందు చేస్తుందని అన్నారు.

ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా పసిడి పంటలతో పరిఢవిల్లాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News