Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు

06-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలకు అన్ని గ్రామాలు ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.

తరువాత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, వారు ఏ తరగతుల్లో చదువుతున్నారో తెలుసుకున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారని, గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ ఆహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని ఆరా తీశారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్న ఓ చిన్నారికి కలెక్టర్ అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News