Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Updated : 07 Mar 2026 23:34 IST
As Preferred Source 1 min read
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళా విద్యతోనే సమాజానికి మేలు......

సీనియర్ సివిల్ జడ్జి సురేష్.....

మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.....

మహిళా విద్యతోనే సమాజానికి మేలు జరుగుతుందని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కోదాడ కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

ముఖ్యంగా భారతదేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి వారు దేశాన్ని శక్తివంతంగా మారుస్తున్నారని పేర్కొన్నారు. చట్టసభలు, సైనిక మరియు న్యాయ వ్యవస్థల్లో మహిళలకు సమాన వాటా లభిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. రామకృష్ణ, మహిళా ప్రతినిధి ధనలక్ష్మి, న్యాయవాదులు హేమలత, శిల్ప, కోర్టు సూపరింటెండెంట్ రజిని, సీనియర్ న్యాయవాదులు పద్మ,రంగారావు, గట్ల నరసింహారావు,శరత్ బాబు, రాజన్న, దావీదు, రామ్ రెడ్డి, గోవర్ధన్, మందా వెంకటేశ్వర్లు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు..

Sthanikam

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news