Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన సబ్‌ కలెక్టర్ ఉమా హారతి న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 02:23 PM

మహిళల భద్రతకు అవగాహనే శ్రీరామరక్ష - సీఐ మన్మధ కుమార్

23-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళలు తమ భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో ధైర్యంతో పోలీసుల సహాయం పొందాలని చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి.మన్మధ కుమార్ సూచించారు. ధర్మోజీగూడెం గ్రామంలోని 'సినర్జీ' కంపెనీ ప్రాంగణంలో గురువారం మహిళల భద్రత, హక్కులు, స్వీయ రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను ఎలా వినియోగించుకోవాలి, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాధాన్యతను వివరించారు. అలాగే రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమగ్రంగా తెలియజేశారు.​ మహిళల భద్రతకు అవగాహన, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తితో పాటు సరైన సమయంలో పోలీసులను సంప్రదించడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సదస్సులో పాల్గొన్న మహిళలు తమకున్న పలు అనుమానాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల భద్రతకు అవగాహనే శ్రీరామరక్ష - సీఐ మన్మధ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News