Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం
07-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఉద్యోగినుల విధి నిర్వహణ అభినందనీయం : టీజీఎస్ ఆర్టీసీ విసి & ఎం.డి వై.నాగిరెడ్డి కితాబు

ఇంటాబయటా అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా మహిళా సిబ్బంది విధి నిర్వహణ మాత్రం బాధ్యతాయుతంగా చేస్తున్నారని టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ శ్రీ వై.నాగిరెడ్డి ఐ.పి.ఎస్ అన్నారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్ భవన్ లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఈతరం మహిళా లోకం ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుని పురుషులకు తామేమి తీసిపోమని చాటిచెబుతుండటం హర్షించదగ్గ పరిణామమని కొనియాడారు.

అదేవిధంగా అవకాశాలు కల్పించడంలో అడా,మగ తేడా చూపకూడదని... స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదని, మహిళలకు మానసిక స్థైర్యం ఎక్కువ అని ఆయన అన్నారు. ఈ సంస్థ మనది... ఆర్టీసీ సంక్షేమం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి విజయపుష్ప కేక్ కట్ చేసి మహిళ ఉద్యోగులకు కేక్ తినిపించారు. అనంతరం మహిళ ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఈడీలు .వి.మునిశేఖర్ , సి.హెచ్.వెంకన్న , సి.పి.ఎం , శ్రీదేవి , సీఈ (ఐటీ) శ్ వి.శ్రీదేవి , తదితర మహిళా అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

మహిళాభ్యుదయం - జాతికి శుభోదయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News