Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:52 AM

మహిళా సాధికారతే లక్ష్యం.. అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాలి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

12-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి ప్రధాన బలం అని, మహిళలందరూ అన్ని రంగాల్లో పురోగమిస్తూ సమాజ నిర్మాణంలో ముందుండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

చైతన్యపురి కమ్యూనిటీ హాల్‌లో “ఓం శ్రీ మాత్రే నమః” సంస్థ ఆధ్వర్యంలో మంజుల నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవుల్లో 75 శాతం అవకాశాలు కల్పించిందన్నారు. మహిళలు పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేషమైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

మహిళా సాధికారతే లక్ష్యం.. అన్ని రంగాల్లో మహిళలు పురోగమించాలి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త

Article Image

మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి ప్రధాన బలం అని, మహిళలందరూ అన్ని రంగాల్లో పురోగమిస్తూ సమాజ నిర్మాణంలో ముందుండాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

చైతన్యపురి కమ్యూనిటీ హాల్‌లో “ఓం శ్రీ మాత్రే నమః” సంస్థ ఆధ్వర్యంలో మంజుల నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ పదవుల్లో 75 శాతం అవకాశాలు కల్పించిందన్నారు. మహిళలు పురుషులకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు విశేషమైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలను సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News