Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 12:39 AM

మహిళా విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి.ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

11-03-2026 287 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, మహిళా విద్యార్థులు ఆర్థిక స్వావలంభన సాధించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. విశ్వవిద్యాలయ మహిళాభివృద్ధి, విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో “గివ్ టు గైన్” అంశంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి వి-హబ్‌తో కలిసి “వి-ఎనేబుల్” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థుల్లో మహిళలు 49 శాతం ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్నత విద్యను అభ్యసించడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సాధికారతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని, ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ డా. ప్రియాంక వర్గీస్ (ఐఎఫ్‌ఎస్) మాట్లాడుతూ మహిళలకు విద్యతో పాటు కనీస వనరులు కల్పిస్తే వారు ఆర్థిక స్వావలంభన సాధించగలరని తెలిపారు. మహిళలకు గౌరవం మొదటగా ఇంటి నుంచే దక్కాలని, అప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని చెప్పారు. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు మహిళా విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. మహిళా విద్యాభివృద్ధికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ప్రపంచంలో స్త్రీని మించిన శక్తి లేదని, మహిళల సాధికారత కోసం విశ్వవిద్యాలయం ప్రత్యేక పాఠ్యాంశాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయకృష్ణా రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.

విశ్వవిద్యాలయ మహిళా అభివృద్ధి, విస్తరణ కేంద్రం ఇంచార్జ్ ప్రొ. కె. రాణి రజిత మాధురి కార్యక్రమం అవసరాన్ని వివరించి ప్రధాన వక్తను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రొ. ఇ. సుధారాణి, ప్రొ. పల్లవి కాబడే, ప్రొ. కె. శ్రీదేవి, ప్రొ. ఎన్. రజని, ప్రొ. మేరీ సునంద, డా. ఉదయిని, రుషీంద్ర మణి, సరితతో పాటు విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, విభాగాధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి.ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News