Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:09 PM

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు

06-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి–భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడా పోటీలను నిర్వహించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల కోసం స్పీడ్ వాక్ (50 మీటర్లు), టెన్నికోయిట్ (సింగిల్), క్యారమ్స్, షటిల్ బ్యాడ్మింటన్ (సింగిల్) వంటి పోటీలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎన్జీఓస్ జాయింట్ సెక్రటరీ ఆర్. శైలజతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల మహిళా అధికారులు, మహిళా సిబ్బంది సుమారు 200 మంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి దశరథ్ రెడ్డి, గోపాల్, పీడీలు, పీఈటీలు మరియు కార్యాలయ సిబ్బంది మురళి, జయ, శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ మహిళలు ఉద్యోగ బాధ్యతలతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఆకాంక్షించారు.

Sthanikam

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News