Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

మహనీయుల జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

30-03-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: జిల్లాలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు సూచనలు, సలహాలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే, ఏప్రిల్ 14న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల నాయకులు, ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సాహితీ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, ఈడీఎస్సీ కార్పొరేషన్ శ్యాంసుందర్, వివిధ సంఘాల నాయకులు, ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహనీయుల జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News