Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

03-04-2026 930 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నీర్నముల గ్రామంలో మద్యపాన నియంత్రణపై గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెరుగుతున్న మద్యం వినియోగం ఆందోళన కలిగిస్తోందని సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

సర్పంచ్ మాట్లాడుతూ, ఇటీవల ఒక దుకాణం వద్ద గమనించిన ఘటన తనను కలవరపరిచిందన్నారు. ఒక మహిళ పాల ప్యాకెట్ అడగగా, దుకాణదారు రహస్యంగా క్వార్టర్ మద్యం అందించడం చూసినట్లు చెప్పారు. అదే విధంగా మరికొందరికి కూడా మద్యం సరఫరా జరుగుతుండటం ప్రత్యక్షంగా గమనించానన్నారు.

గ్రౌండ్ స్థాయిలో పరిశీలిస్తే గ్రామంలో ప్రతిరోజూ సుమారు రూ.50 వేలకుపైగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు, మహిళలు సైతం మద్యం వినియోగంలో ఉండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ఈ పరిస్థితి కొనసాగితే గ్రామానికి ప్రమాదం తప్పదని భావించి, గ్రామపంచాయతీ పాలకమండలి, ఉపసర్పంచ్, సభ్యులందరూ కలిసి మద్యపాన నిషేధంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.

గ్రామ ప్రజలంతా ఈ నిర్ణయానికి సహకరించాలని సర్పంచ్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. “మన గ్రామ భవిష్యత్తు కోసం అందరం కలిసి ముందుకు రావాలి” అని ఆయన సూచించారు.

Sthanikam

మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News