Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ

11-03-2026 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు మరియు యువత వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు.

మంగళవారం బీచ్ మహల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణకు ఏర్పాటు చేసిన ప్రహరీ క్లబ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా నాశనమై రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు.

మాదకద్రవ్యాల ద్వారా కలిగే తాత్కాలిక ఆనందం కంటే జీవితంలో విజయాన్ని సాధించడం ద్వారా లభించే ఆనందం ఎంతో విలువైనదని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. చెడు అలవాట్లు ఉన్న వారితో దూరంగా ఉంటే జీవితం మరింత మంచిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, పాఠశాలలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పరీక్షలపై భయాన్ని విడిచి పట్టుదలతో చదవాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచీ చెడూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి అన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రామచంద్రం, షీ టీం సభ్యులు వరలక్ష్మి, రిసోర్స్ టీచర్లు ఎం. అనిత, జి. రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News