Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

లో వోల్టేజ్‌కు చెక్… రైతులకు ఊరట ధర్మోజిగూడెంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

06-03-2026 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజిగూడెం గ్రామ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల వద్ద ఉన్న 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లో లో వోల్టేజ్ సమస్య కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేయించారు అని చెప్పారు.

కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వల్ల రైతులకు లో వోల్టేజ్ సమస్య తొలగి, వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, రైతులు బత్తుల శ్రీహరి, ఐతరాజు సత్తయ్య, ఊదరి శంకర్, ఐతరాజు శ్రీనివాస్, రాచకొండ కృష్ణయ్య, కొంతం మాధవ రెడ్డి, కొంతం లక్ష్మారెడ్డి, ఐతరాజు శంకర్, పక్కీరు జయలక్ష్మి, కన్నెమోని సుగుణమ్మ, ఐతరాజు బక్కయ్య, కన్నెమోని శ్రీనివాస్, దాసరి శేఖర్, గునుగంటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లో వోల్టేజ్‌కు చెక్… రైతులకు ఊరట ధర్మోజిగూడెంలో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News