Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:37 AM

లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి

02-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీ నగర్, మహిళా వేధింపుల కేసు క్లోజ్ చేయించేందుకు లంచం తీసుకుంటూ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.

కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు పల్లపు రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

ముందస్తు ప్రణాళికతో కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసిన అధికారులు, బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.363/2025కు సంబంధించి ఈ ఘటన చోటుచేసుకుంది. కాంప్రమైజ్ అయిన కేసును క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో పోలీస్ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

లంచం తీసుకుంటూ ఏఎస్సై అరెస్ట్. ఏసీబీ వలలో చైతన్యపురి పోలీస్ అధికారి

Article Image

ఎల్‌బీ నగర్, మహిళా వేధింపుల కేసు క్లోజ్ చేయించేందుకు లంచం తీసుకుంటూ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.

కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. బాధితుడు పల్లపు రాంబాబు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

ముందస్తు ప్రణాళికతో కోర్టు ప్రాంగణంలో ట్రాప్ ఏర్పాటు చేసిన అధికారులు, బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.363/2025కు సంబంధించి ఈ ఘటన చోటుచేసుకుంది. కాంప్రమైజ్ అయిన కేసును క్లోజ్ చేయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో పోలీస్ శాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News