మహిళ కడుపులో లాపరో స్కోపిక్ ద్వారా 08. కిలోల కణితి తొలగింపు.
జంగారెడ్డిగూడెం,
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సాయిస్ఫూర్తి మల్టీస్పెషల్టి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. బుట్టాయిగూడెం మండలం పండుగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించింది.
పరీక్షలు నిర్వహించిన డాక్టర్ సంకు మురళి కడుపులో భారీ ఒవేరియన్ సిస్టు (కణితి) ఉన్నట్లు గుర్తించారు. గురువారం లాపరోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 8 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు.
ఇంత భారీ కణితిని లాపరోస్కోపిక్ పద్ధతిలో తొలగించడం అరుదైన ఘటనగా వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి