Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:29 PM

లలిత కుమారి విన్నపం: ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలి

17-01-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ

అధికారి కేతావత్ లలిత కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ అనర్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.గత ఏడాది సంగారెడ్డి జిల్లాలో మొత్తం 62 బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి జరగకుండా నిలిపివేశామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు జరగబోతున్నట్టు సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు.బాలికలు చదువులో, క్రీడల్లో రాణిస్తూ జీవితంలో ముందుండాలని, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా సంక్షేమ శాఖను సంప్రదించాలని ఆమె సూచించారు.

Sthanikam

లలిత కుమారి విన్నపం: ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News