Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి

14-03-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోనిలో ఎన్డీఏ కూటమిని దెబ్బతీయాలని వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతోందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆరోపించారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన జనసేన కార్యకర్తను స్వయంగా కలిసిన ఆయన, పార్టీ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.

జనసేన కార్యకర్త సాయికుమార్ సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు గంట వ్యవధిలోనే స్పందించిన ఎమ్మెల్యే పార్థసారధి, ఆయనను ప్రత్యక్షంగా కలిసి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అసంతృప్తి ఉన్న కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి బలంగా కొనసాగుతుందని, ఇంకా దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కూటమిని బలహీనపరచాలని చూస్తున్న వైఎస్సార్సీపీ కుట్రలను కార్యకర్తలు తిప్పికొడతారని అన్నారు.

ఆదోనిలో కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేరని ఎమ్మెల్యే పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Sthanikam

కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారధి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News