Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:29 AM

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

19-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీ బీరప్ప కామరాతి ఆలయంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు జరిగాయి.

మాజీ సంఘం అధ్యక్షుడు రేగు బాలనర్సయ్య, ఎన్నికల అధికారి కల్లేపల్లి శ్రీశైలం, ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య పర్యవేక్షణలో సభ్యులందరూ కలిసి నూతన కమిటీని ఎంపిక చేశారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా జోగు మహేష్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ… సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన అచ్చిన మల్లయ్యను సభ్యులు ఘనంగా సత్కరించారు.

అచ్చిన మల్లయ్య మాట్లాడుతూ కురుమలు రాజకీయంగా చైతన్యవంతులై ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కురుమల హక్కుల సాధనకు, వారి అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

అనంతరం యువజన కమిటీని కూడా ఎన్నుకోగా, అధ్యక్షుడిగా గుజ్జ సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా జోగు భాను ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో గోధుమ బీరయ్య, జోగు చంద్రయ్య, వార్డు సభ్యులు చిన్నం మల్లేష్, కళ్లే వినోద్, అచ్చిన కృష్ణస్వామి, ఒగ్గు నవీన్, ఏడపల్లి మహేష్, జోగు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కురుమ సంఘం నూతన అధ్యక్షుడిగా అచ్చిన మల్లయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News