Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 07:35 AM

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి

30-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా సరఫరా చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. పట్టణంలో కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వీరేష్ మాట్లాడుతూ… గృహ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుని 15 నుంచి 20 రోజులు గడిచినా సరఫరా జరగడం లేదని తెలిపారు. సింగిల్ సిలిండర్‌పై ఆధారపడే పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వంట చెరుకు కూడా అందుబాటులో లేక ప్రజలు ఇళ్లలో వంట చేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. గ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూతపడే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Sthanikam

కృత్రిమ గ్యాస్ కొరతపై ఆగ్రహం… సీపీఎం వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News