Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:09 PM

కోతులు, వీధికుక్కల బెడదపై బీఆర్ఎస్ ఆందోళన

21-07-2026 183 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా.. తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్.

చిట్యాల, జూలై 21 :

చిట్యాల పట్టణంలో కోతులు, వీధికుక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండటంపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన వీధుల్లో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడంతో పాటు మహిళలు, చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు.మరోవైపు వీధికుక్కల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, రాత్రి వేళల్లోనే కాకుండా పగటి సమయంలోనూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలన్నా, వృద్ధులు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కారానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు వీధికుక్కల నిర్మూలన, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

కోతులు, వీధికుక్కల బెడదపై బీఆర్ఎస్ ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News