Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:36 PM

కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవ న్యాయ అవగాహన సదస్సు

07-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలోని సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ చట్టాలు మహిళలు, బాలికల భద్రతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్ పాల్గొని మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమాజంలో మహిళల పాత్రపై మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా కోర్టులో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి రెండు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు.

అనంతరం వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామంలో ఉన్న సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆశ్రమంలో ఉన్నవారికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్కడి మధ్యాహ్న భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవ న్యాయ అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News