Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?

19-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుతిల్ ఖర్చులు రైతులపై భారం వద్దు. మేక అశోక్ రెడ్డి.

రామన్నపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను తక్షణమే అలాట్ చేసి ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సుతిల్ దారం ఖర్చులను రైతులపై మోపకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే భరించాలని స్పష్టం చేశారు.

స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ… కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు జరగకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే సుమారు 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు చేరిందని, మిల్లుల అలాట్‌మెంట్ ఆలస్యం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు.

ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌కు సుతిల్ దారం ఖర్చుల కోసం రూ.5 చెల్లిస్తున్నప్పటికీ, నిర్వాహకులు రైతులకు అందించడం లేదని ఆరోపించారు. మండలంలో సుమారు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి ఉంటుందని, ప్రతి క్వింటాల్‌కు రూ.32 కమిషన్ నిర్వాహకులకు లభిస్తున్నదని పేర్కొన్నారు. ముందుగా రైతులకు సుతిల్ దారం అందించి, తర్వాత ప్రభుత్వం చెల్లించే డబ్బులు తీసుకోవాలని సూచించారు.

అకాల వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లలో మౌలిక వసతులు కల్పించి, కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. లారీలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నెబోయిన విజయభాస్కర్, నాయకులు గొరిగే సోములు, అప్పం సురేందర్, పాలెం అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కొనుగోలు కేంద్రాలు తెరిచి… కొనుగోళ్లు ఎక్కడ...?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News