Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:11 PM

కోదాడలో శబ్ద కాలుష్యానికి చెక్.. రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం.....

21-07-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

అతివేగంగా పెద్ద శబ్దాలతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులు పెడితే సహించం.

యువత ఆదర్శంగా ఉంటూ ప్రమాదాలకు దూరంగా ఉండాలి.

... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.

నిబంధనలకు విరుద్ధంగా బుల్లెట్ బైక్లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై కోదాడ పట్టణ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 40 బుల్లెట్ బైక్లను గుర్తించి వాటి మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని మంగళవారం రంగా థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మితిమీరిన శబ్దాలు చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, రోగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ సైలెన్సర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. యువత ఆదర్శంగా ఉండాలి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కోదాడలో శబ్ద కాలుష్యానికి చెక్.. రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లు ధ్వంసం.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News