Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:55 PM

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము

కోదాడ నియోజక వర్గాన్ని వ్యవసాయంలో సస్యశ్యామలం చేస్తాము
March 04, 2026 07:48 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రెడ్లకుంట ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెల చివరి వరకు నిర్మాణ పనులను పూర్తి చేయాలి


రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ,కాంట్రాక్టర్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పాలేరు వాగుపై రెడ్లకుంట వద్ద నిర్మిస్తున్న రెడ్ల కుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను అధికారులతో కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. తదుపరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నియోజక వర్గంలో పలు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల ప్రాజెక్టులు చేపట్టామని, రెడ్ల కుంట వద్ద రూ.14 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని , ఈ పథకం ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, రెడ్ల కుంట పరిధిలో 4,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని అలాగే గ్రామాలలో త్రాగునీరు కూడ అందించడం జరుగుతుందని, ప్రాజెక్టు భూసేకరణ నిమిత్తం 3 ఎకరాల 39 కుంటల భూమి సేకరించి రైతులకు 2 కోట్లు చెల్లించనైనదని, ఈ ఖరీఫ్ సీజన్లో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో అత్యధిక వరి పంట పండి రికార్డ్స్ సృష్టించినదని, మొత్తం 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండినదని, రైతుల నుండి కొనుగోలు, బోనస్ మొత్తము కలిపి రూ.19,800 కోట్లు చెల్లించామని, రాజకీయాలకు అతీతంగా కోదాడ, హుజూర్నగర్ రెండు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్

సిఇ, రమేష్,ఆర్డిఓ సూర్య నారాయణ, నీటిపారుదల అధికారులు, గుత్తందారులు, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News