Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు

04-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ ఘటన మల్కాపురం చెరువు సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్రం గీతాంజలి (34), భరత్‌నగర్, మూసాపేట్, హైదరాబాద్ నివాసి, స్వస్థలం పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆమె తన తల్లి తుర్రం సూర్య ప్రభావతి (60)తో కలిసి మార్చి 2న రాత్రి సుమారు 8:30 గంటలకు నిడదవోలు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు నెంబర్ AP 39Z 0771(డ్రైవర్ దొర ప్రసాద్) గల దానిలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చి 3న ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మల్కాపురం చెరువు వద్ద ముందుగా వెళ్తున్న కంటైనర్ నెంబర్ NL 01AJ 3979ను బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో గీతాంజలి, ఆమె తల్లి సూర్య ప్రభావతికి రక్తగాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Sthanikam

కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరికి గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు

Article Image

హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ ఘటన మల్కాపురం చెరువు సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్రం గీతాంజలి (34), భరత్‌నగర్, మూసాపేట్, హైదరాబాద్ నివాసి, స్వస్థలం పోలవరం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆమె తన తల్లి తుర్రం సూర్య ప్రభావతి (60)తో కలిసి మార్చి 2న రాత్రి సుమారు 8:30 గంటలకు నిడదవోలు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు నెంబర్ AP 39Z 0771(డ్రైవర్ దొర ప్రసాద్) గల దానిలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చి 3న ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మల్కాపురం చెరువు వద్ద ముందుగా వెళ్తున్న కంటైనర్ నెంబర్ NL 01AJ 3979ను బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో గీతాంజలి, ఆమె తల్లి సూర్య ప్రభావతికి రక్తగాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సి ఐ జి. మన్మధ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News