Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

20-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ హాల్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డా. మనోహర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘ఫ్రైడే-డ్రై డే’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవడం, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిల్వ నీటిలో దోమల లార్వా అభివృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్, థీమాఫాస్ వంటి రసాయనాలను వినియోగించాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పెంపొందించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

డిపిఆర్ఓ నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. ఎన్. వంశీకృష్ణ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో అన్ని శాఖల సహకారం అవసరమని తెలిపారు.

ఈ సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. రామకృష్ణ, డా. వీణతో పాటు మున్సిపల్, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసిడిఎస్, డిపిఆర్ఓ, సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ వెల్ఫేర్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా మలేరియా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కీటక జనిత వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. డిఎంహెచ్ఓ డా. మనోహర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News