Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం
21-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

మంగళవారం దోతిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన పరిశ్రమల వ్యర్థాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయని, దీంతో తాగునీటి సమస్యతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలుష్యం కారణంగా క్యాన్సర్, చర్మ, కిడ్నీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మరోవైపు వ్యవసాయం దెబ్బతిని పంట నష్టాలు జరుగుతున్నాయని, రెండు గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా పంటలు నష్టపోతున్నాయని తెలిపారు. పాడి, కూరగాయలు, పండ్ల తోటల రైతులు, గీత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా వాయు, జల కాలుష్యాన్ని పెంచుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని, లేకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మాజీ మండల కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శికి మెమోరాండం అందజేశారు.

Sthanikam

కెమికల్ పరిశ్రమలు ఎత్తివేయాలి.సీపీఎం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News