Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: సీపీఐ(ఎం) తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 23, 2026 10:14 PM

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి;సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి;సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి;సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి
July 23, 2026 08:36 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం: నీట్ పరీక్ష లీకేజ్ కి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరిడిమాండ్ చేశారు. గురువారం నాగారం మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జిని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ

నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్‌లకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువత గుమిగూడారని అన్నారు. శాంతియుత నిరసన తెలియజేస్తున్న వారి పై పోలీసులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. పోలీసు దాడులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు పోలీసులు దారుణంగా వ్యవహరించడంతో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.పేపర్ లీక్‌లకు బాధ్యులను గుర్తించడంలో, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నెల రోజులుగా కొనసాగుతున్న నిరసనల పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంబించడం దురదృష్టకరమన్నారు.

ప్రజలలో, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని అణచివేత చర్యలతో అరికట్టలేరని హెచ్చరిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, అరెస్టు చేసిన నిరసనకారులందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వారికి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి కోటి రూపాయలకు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడెం కుమార్, గుడి పురి వెంకటేశ్వర్లు, నాయకులు తంగేళ్ల వెంకన్న, శ్రీధర్, సురేష్, ఎల్లయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News