Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోతులు, వీధికుక్కల బెడదపై బీఆర్ఎస్ ఆందోళన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 12:46 PM

"కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది".. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!

"కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది".. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!

"కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది".. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్..!
July 21, 2026 12:37 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలో నీళ్లు అయిపోతాయని హెచ్చరిక

గోదావరి జలాలు సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శ

కాళేశ్వరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఉత్తమ్‌కు జగదీష్ రెడ్డి సవాల్

నల్గొండ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కరువు నివారణపై చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో మరో 15 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టకపోతే నల్గొండతో పాటు హైదరాబాద్ నగరానికీ తాగునీటి ఎద్దడి తప్పదని హెచ్చరించారు. గోదావరి నదిలో భారీగా నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నప్పటికీ, ఆ నీటిని వినియోగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీరు అందించామని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కూడా సమర్థవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం ఆ పథకం నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదని అన్నారు.

వ్యవసాయ రంగంపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రైతులకు సమయానికి విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని, ఇంకుడు గుంతల పేరుతో రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రోజుకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కూడా రైతులకు అందడం లేదని పేర్కొన్నారు.

సాగర్ ప్రాజెక్టు నుంచి 50 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు సుమారు 150 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. జిల్లా సమీక్ష సమావేశాల పేరుతో ప్రభుత్వం కేవలం ప్రచారం చేసుకుంటోందని, ముందస్తు ప్రణాళికలు, కార్యాచరణ లోపించాయని అన్నారు.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీటి నిర్వహణపై మంత్రికి సరైన అవగాహన లేదని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. కన్నెపల్లి పంపులు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా రాష్ట్రానికి అవసరమైన నీటిని ఎలా అందించవచ్చో ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరిగేషన్ మంత్రి తన పదవికి అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు మరింత విషమించకుండా ప్రభుత్వం వెంటనే కార్యాచరణ రూపొందించి తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News