Sthanikam - Truth Matters
Logo
Home / అధ్యయనం / అభ్యాసం మరియు నైపుణ్యాలు

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

Updated : 12 Mar 2026 22:13 IST
As Preferred Source 1 min read
క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

సోమందేపల్లి: త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు ఆకాంక్షించారు. సోమందేపల్లిలోని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సరస్వతీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడితో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు విద్యార్థులను ఆశీర్వదించారు.

అనంతరం వేద పండితుడు విద్యార్థులకు అమ్మవారి తీర్థ ప్రసాదం అందించి పరీక్షల్లో విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్, ఎండీ అనిల్‌కుమార్, హెచ్‌ఎం హరినాథ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు

Article Image

సోమందేపల్లి: త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు ఆకాంక్షించారు. సోమందేపల్లిలోని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సరస్వతీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడితో సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని యాజమాన్యం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు విద్యార్థులను ఆశీర్వదించారు.

అనంతరం వేద పండితుడు విద్యార్థులకు అమ్మవారి తీర్థ ప్రసాదం అందించి పరీక్షల్లో విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ప్రసాద్, ఎండీ అనిల్‌కుమార్, హెచ్‌ఎం హరినాథ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news